Skip to main content

Bharatiya Vidya Bhavan’s

భారతీయ విద్యా భవన్స్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయ తిరుపతిలో నేడు గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అద్వైత వేదాంత విభాగం అధిపతి, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి ఆచార్య గణపతి భట్ విచ్చేశారు. ఆత్మీయ అతిథిగా    శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఆచార్య అల్లాడి మోహన్ గారు విచ్చేశారు.
ఈ కార్యక్రమానికి భారతీయ విద్యా భవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డా. నడింపల్లి సత్యనారాయణ రాజు గారు అధ్యక్షత వహించారు. ఆయన ప్రసంగిస్తూ ఆచార్య గణపతి భట్ గారు భారతీయ సనాతన ధర్మాన్ని ప్రజలకు అందిస్తున్నారని తెలియజేశారు గురువులను వేదవ్యాస స్వరూపులుగా భావించాలని విద్యార్థులకు తెలియజేశారు. బ్రహ్మ విష్ణు పరమేశ్వరులతోపాటు నిర్గుణ స్వరూపునిగా గురువుని ప్రతిపాదించారు. అలాగే భారతీయ విద్యా భవన్ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ విజ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తూ అగ్ర సంస్థగా వెలుగొందుతోందన్నారు. ధైర్యం, బలం, బుద్ధి, ఉద్యమం, సాహసం, పరాక్రమం అనే గుణాలు విద్యార్థులకు ఉండాలన్నారు అప్పుడే విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని సూచించారు.
ఆత్మీయ అతిథి ఆచార్య అల్లాడి మోహన్ గారు ప్రసంగిస్తూ గురువులకు వందనం తెలపడం సనాతన ధర్మంలో ఉందన్నారు. గురువు కేవలం విషయపరిజ్ఞానం తెలిపేవాడు మాత్రమే కాదని, గురువు జీవితానికే మార్గదర్శిగా ఉండాలని సూచించారు.
విద్యార్థిని విద్యార్థులు గురు ప్రాధాన్యత గురించి నాటక ప్రదర్శన మరియు గేయాలాపన చేశారు. తదుపరి ముఖ్యఅతిథిని కమిటీ సభ్యులు దుశ్శాలువతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, తిరుపతి కేంద్ర కమిటీ సభ్యులు, పాఠశాల కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి డి. పద్మజ ఉప ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె. పుణ్యవతి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
School Events